20, జనవరి 2010, బుధవారం

కొంతమంది పేర్లు వింటూంటే వీళ్ళకి ఈ పేర్లు ఎలా పెట్టారని అనిపిస్తుంది . ఎందుకంటే విశాలాక్షి అంటే
విశాలమయిన కన్నులు అని అర్థము కదా ; ఒకావిడ ఆవిడ పేరు విశాలాక్షి అని చెప్పగానే నేను ఈవిడకు
ఈపేరు ఎలా పెట్టారా ?అని అనుకున్నాను ,ఎందుకంటే ఆవిడ కళ్ళు ఎంత చిన్నవిగా ఉన్నాయంటే ఏనుగు
కళ్ళు అంత ఉన్నాయి . ఒకతని పేరు కోటేశ్వరరావు అని చెప్పితే ఆశ్చర్య పోవటం నా వంతు అయ్యింది .
ఎందుకంటే అతనికి పాపం తినడానికే చాలా కష్టంగా ఉండేది .
ఇలాంటి పేర్లు ఎలా పెట్టతారో అని అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు .
పేరులో ఏముంది ? అని అంటూ ఉంటారు కొంతమంది . పేర్లోనే పెన్నిధి ఉందని అంటూ ఉంటారు మరి
కొంత మంది . ఔను ,నిజమే .పేరు తెలియక పోతే ఎవరేమిటో తెలియదు కదా ; పేరుని బట్టే కదా ఒక
మనిషిని గుర్తుంచు కోగలం కదా ;
ఇన్ని విశేషాలు ఉన్న పేరుని ముద్దు పేర్లుగా మార్చేస్తారెందుకో మనుష్యులు .
మొత్తానికి ఎవరి పేరయినా ఎలాంటి రూపాలు పొందుతాయో ,ఎవరికీ తెలియదు కదా .
ఇవన్నీ అదే బారసాలనాడు పెట్టిన పేర్లు , ముద్దుపేర్లుని వింటూ ఉంటె మనిషికి వాళ్ళ పేర్లు
వాళ్ళ జీవిత చరమాంకానికి ఎటువంటి మార్పులు పొందుతాయో వాళ్ళకే తెలియదు కదా ; అని అనిపిస్తుంది .
ఎంత గొప్ప వాళ్ళ పేర్లలోనైనా ముద్దు పేర్లు ఉండక మానవు కదా ;
మరి కొంత మంది పేర్లుకి బిరుదులూ కూడా చేరుతూ ఉంటాయి .సర్దార్ అని ,గాన కోకిల అని ,పద్మశ్రీ అని .
పేరు మార్పు పొందినప్పుడు ,అదే పిలిచే పద్ధతిని బట్టీ కానీ ,పలికే తీరుని బట్టీ కానీ అనుకోకుండా మంచి
మంచి లాభాలు కూడా కలుగుతాయని కొందరు అంటూ ఉంటారు . నిజమే ,కొందరి విషయములో అది
జరిగే ఉంటుంది . వినగా వినగా అందరికి వాళ్ళ వాళ్ళ ముద్దు పేర్లు అంతో ఇంతో లాభాలు ,అదృష్టాలు
తెచ్చే ఉంటాయి .

కామెంట్‌లు లేవు: