7, జనవరి 2010, గురువారం

ఆనందము _

ఆనందము

ఒక రోజు అమెరికాలో ఉన్నప్పుడు మా చిన్న అబ్బాయి కిరణ్ ,కోడలు ఉమ indiaanaapolice down townki

కి

వెళ్ళుద్దాము అంటే నేను ,మా వారు కలసి బయలుదేరాము వాళ్ళతో .మామూలుగా మేము జనవరి ౧౪ న బయలు

దేరి ఇండియాకి వెళ్ళాలి . కాని మా వారి ఆఫీసు నుండి వారి ఆఫీ సు బ్రాంచి కి వెళ్ళమని ఫో ను రావటము తో మా

మా ప్రయాణం వాయిదా పడింది . ఇలా జరిగినట్లు హూస్టన్ లో నున్న మా పెద్ద అబ్బాయి కి ఫోన్ చేసి

చెప్పాము . వెంటనే మా పెద్ద అబ్బాయి మాకు ఇది బోనస్ ,మా దగ్గర ఇంకొద్ది రోజులు ఉండటం మాకు చాలా

సంతోషం అని అన్నాడు .

సరే ,మేము డౌన్టౌన్ కి బయలు దేరే ముందురోజు రాత్రి "దుబాయి శీను " సినిమా చూస్తూ ఉండటం వలన

పడుక్కోవటం ఆలస్యం అయ్యి ,మర్నాడు తొందరగా లేవలేక పోయాము .కానీ లేచిన వెంటనే తొందరగా తయారయి

కారులో బయలు దేరాము .అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డౌన్టౌన్కి చేరుకున్నాము . అక్కడికి

చేరుకున్నాక మా కిరణ్ మమ్మల్ని ,ఉమని ఎదురుగా ఉన్న కేఫ్ లోకి వెళ్లి కాఫీ తీసుకుంటూ ఉండండి .నేను

కారు పార్కింగ్ చేసి వస్తాను అని చెప్పి వెళ్ళాడు .

మేము కెఫే లోకి వెళ్ళుతుండగా ఎంట్రన్సు లో పెద్ద బ్లాక్ ఎలుగు బంటీ బొమ్మ కనిపిస్తే దాని దగ్గర నిలబడి

ఫోటోలు తీసుకున్నాము . తరువాత ఉమ మమ్మల్ని కేఫ్ లో ఉన్న ఒక రూములో కూర్చోబెట్టి కాఫీ ఆర్డర్

ఇవ్వటానికి రూము బయటకు వెళ్ళింది .అక్కడ కాఫీలన్నీ రకరకాల రుచులలో ,వెరైటిగా దొరుకుతాయి .

అందుకని మా ఉమ నాకు కావలసిన కాఫీ తేవడానికి రూము బయటకు వెళ్లి ఆర్డరు ఇస్తోంది . మేము

కూర్చున్న రూము చుట్టూ గ్లాసు తలుపులతో ఉన్నది . నేను మా వారితో ఇద్దరము కలిపి ఒక కాఫీ చెప్పా

ల్సింది ,ఎక్కువ తాగలేమేమో అని అన్నాను . చూద్దాములే అని తను నాతొ అంటున్నారు .ఇంతలో నేను

తలెత్తి చూసేసరికి మా కిరణ్ కెమేరాతో మా ఇద్దరికి ఫోటో తీస్తూ కన్పించాడు . ఫోటో తీస్తున్నావా అని

అంటూండగా మా పెద్ద అబ్బాయి కన్పించాడు . హూస్టన్ నుండి మేము ఉన్న హోటలుకి వచ్చాడు .

నిజం చెప్పొద్దూ ,ఇది కలయా ? నిజమా ? భ్ర్ర మా ? అని ఒక్క సారిగా ఆశ్చర్య పోయాము .ఏమమ్మా

బాగున్నావా ?అని మా పెద్ద అబ్బాయి నా దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకునేసరికి చాలా ఆనందమన్పించింది .

మా వారికయితే కళ్ళమ్మట నీళ్ళు ధారాపాతముగా కారిపోతున్నాయి ఆనందంతో . నేను పిల్లలతో ముందర

నాన్నగారిని చూడండి . ఆయన మొహం ఎంత ఆనందంతో వెలిగి పోతోందో ?అన్నాను .మా పెద్ద అబ్బాయి ,

చిన్న అబ్బాయి వెంటనే నా దగ్గర నుండి వెళ్లి వాళ్ళ నాన్నగారిని గట్టిగా పట్టేసుకున్నారు . నిజం చెప్పొద్దూ

నాకు వాళ్ళని అలా చూడగానే చాలా ఆనందమన్పించింది . నా కన్నులు కూడా నాకు తెలియకుండానే

ఆనంద బాష్పాలు కురుపించ సాగాయి . మా కోడలు వెంటనే " గుర్తుంచుకునే సంఘటన " అంటూ ఫోటోలు

తీసేసింది . చాలాసేపు మేమందరమూ నవ్వులతో ,ఒక రకమయిన విబ్రాంతితో మేము గడిపాము .

నిజంగా మీ జీవన యానంలో మీరు బాగా ఆనందించిన సంఘటనా ఏమిటి ?అని ఎవరయినా అడిగితె

నేను ఈ విషయమే చెబుతాను .నాకింకా ఆ దృశ్యము నా కన్నుల ముందే జరుగుతున్నట్లుగానే ఉంది .

మాటలలో చెప్పలేని ఆనందం , మనస్సు ,తనువు పులకించి ,పరవశించే అంత సంతోషం . సుమధుర ,

సుహాసాల నడుమ తపించిపోయిన ,తలపించిన ఆహ్లాదం ,ఒకింత ఆశ్చర్యం ,మా పిల్లలు .కోడలు మేము

అనుకున్నట్లుగానే ఉన్నారనే గర్వము ,మా పెద్ద కోడలు కూడా ఉంటె ఎంత బాగుండును ? అన్న తలపు

,అన్నీ కలగా ,పులగంగా కలసిన మనస్సుల పరవశం , ప్రపంచాన్నంతా ఎదుర్కోగలమనే ఎనలేని

ధీరత్వము ,అది ,ఇది అని కాదు నవరసాల నడుమ ఉండే హాస్యానందం .

అందరం సరదాగా , సల్లాపంగా ,సంతోషముగా గడిపిన నిజమయిన రోజు .కలకాలం మదిలో నిలుపుకోవాలసిన

సంఘటనే ఇది అని అన్పించింది . ఇవన్నీ వ్రాస్తున్నప్పుడు కూడా నా కన్నులు కొద్దిగా తడిగా ఉండటం నేను

గమనించక పోలేదు . ఇది అంతా మావారి ఆఫీసులోని అతిధి రూములో కూర్చొని వ్రాస్తున్నాను కనుక

తొందరగా కన్నుల నీరు ఉబికి రాకుండా కన్నుల నడుమనే దాచుకున్నాను .

రోజు, మేము గడిపిన రోజు , మా పిల్లలతో సంబరం పట్టలేని సంతోషంతో గడపిన రోజు .

ఈ రోజుకీ మళ్ళీ అటువంటి రోజు వస్తుందా? వచ్చినా అంత ఆనందం , ఎంత ఆనందమంటే

చెప్పలేనంత ఆనందం , ఎవరికీ చెప్పినా వారికి అర్ధం కాని అంత ఆనందం .

ఆహ్లాదంతో ,సంతోషంతో చెప్పలేని ,పట్టుకోలేని అంత ఆనందం .

అంతా ,ఇంతా కాని అంతులేని అన్నంత ఆనందం .

జీవితంలో తీపి గుర్తుగా ,మధుర స్వప్నంగా నిలిచిపోగలిగిన రోజు .

ఒక అనుభూతిని మిగిల్చిన ఆనందం .

ఆశ్చరయం కలిగించిన ఆనందం .

ఉద్విగ్నతకు లోనయిన ఆనందం .

ఉత్సాహాన్ని జత కలిపినానందం .

ఆవేశాన్ని ఆపుకోలేని ఆనందం .

ఆహ్లాదాన్ని నింపిన ఆనందం .

అనురాగాన్ని ,ప్రేమల్ని పంచుకున్న ఆనందం .

అరున్నోదయపు కాంతులలో అరవిచ్చిన ఆనందం .

కొలమానానికి కొలబద్ద లేని ఆనందం .

స,రి,గ,మ ,ల సరాగాలు కూడా చెప్పలేని అంత ఆనందం .

నాట్యానికి కూడా దొరకలేనంత ఆనందం .

అంబరపు సరిహద్దులు మించిన ఆనందం .

సముద్రపు కెరటాలకు కూడా దొరకలేనంత ఆనందం .

అందాన్ని మించిన ఆనందం .

కామెంట్‌లు లేవు: