29, జూన్ 2017, గురువారం

పేరు - మార్పు

నా పేరు లక్ష్మి . నా పేరు అంటే నాకెంతో ఇష్టం . ఎందుకంటే మా అమ్మా ,నాన్న పెట్టిన పేరు కనుక . నేను శ్రావణ శుక్రవారము ,వరలక్ష్మీ వ్రతం రోజున పుట్టానని నాకు ఆ పేరు పెట్టామని అమ్మ చెప్పింది .
నా పేరు పెద్దలు పెట్టింది ఒకటయితే ,అమ్మవారి పేరు అవ్వటం వలన నాకు ,నా పేరంటే చాలా చాలా ఇష్టం .
కానీ ,నేను బొద్దుగా ,ముద్దుగా ఉండేద్దానని నన్నూ మా అమ్మమ్మ బుజ్జీ ,బుజ్జమ్మా అని పిలిచేవారని మా
అమ్మ నాకు చెప్పింది . మా నాయన్నమ్మ నన్ను అమ్మలూ అని పిలిచేవారు. అమ్మా ,నాన్నా కూడా అమ్మలూ
అనే పిలిచేవారు .అమ్మా ,నాన్నా అలా పిలిచేసరికి మా బంధువులు కూడా అమ్మలూ అనే పిలిచేవారు .నేను
కూడా ఆ పిలుపుకి అలవాటు పడిపోయాను .
బడిలో వేసేటప్పుడు నా పేరు 'వరలక్ష్మీ ' అని రిజిస్టరులో వ్రాయించారు . నా పేరు పుట్టిన తరువాత పెట్టినదే
అయినా ,స్కూలులో , రిజిస్టరులో వ్రాయించిందే అయినా , నాతో పాటు మార్పు చెందింది . అదీఅమ్మలు అనే పేరు రూపాంతరాలు పొందింది .అదే అమ్మలూ ,బొమ్మలూ అని ,బుజ్జీ ,బుజ్జమ్మా అని రక రకాలుగా మారింది .ఎంత ముద్దు అయితే
మాత్రం అలా పిలవటం ఏమిటి ? చక్కగా " లక్ష్మీ " అని పిలవచ్చుగా :పేరు మరి అలా పెట్టటం ఎందుకు ? నాకు
ఎందుకో అలా ,అదే అమ్మలూ .బుజ్జీ అని పిలవటం అంతగా నచ్చలేదు . కానీ నాకు తెలియకుండానే .బంధువులు
అమ్మా ,నాన్న, అందరూ ,అదే ఆఖరికి ఇరుగు పొరుగు కూడా ఎవరికీ తోచినట్లు వాళ్ళు పిలుస్తూంటే "ఊ "అని
"ఆ ",వస్తున్నా అని పలికేదాన్ని .దానితో నా ప్రమేయము లేకుండానే ,నా వయస్సుతో పాటూ అది నా వెంటే
నాతో పాటూ ఉంటున్నా , అంతగా పట్టించుకోలేదు .
కానీ ఒకసారి మా పిన్ని కూతురు నా కన్నా చిన్నది అవ్వటం వలన నన్ను " అమ్మలక్కా " అని
పిలిచేసరికి ఒక్కసారిగా నాకు తెలియకుండానే ఉలికి పడ్డాను . ఎందుకంటే "అమ్మలక్కలు " అంటే ఊసు పోసు
కబుర్లు చెప్పుకునే ఆడ వాళ్ళని అంటూ ఉండేవారు కదా : అందుకనే తను అలా పిలవగానే ఒక్కాసారిగా నేను
కూడా వాళ్ళలో చేరిపోయానా ? అని అనుకున్నాను . నా పిలుపుకి ఇలాంటి అర్ధము ఉంది కదా అని
గుర్తు తెచ్చు కున్నాను . అందుకనే ఒక్క సారిగా "అమ్మలూ" అనే పిలుపుమీద ఒక రకమైన వెగటు పుట్టింది .
అయినా కూడా చిన్నప్పటినుండి అందరు అలా పిలవటం వలన , అందరూ అలా పిలిస్తే నేను కూడా
పలకటం వలన ఇప్పటికీ అంటే ఈ ముదిమి వయస్సులో కూడా ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది .
స్కూలులో మాత్రం నన్ను" లక్ష్మీ అని పిలిచేవారు స్నేహితులు . కానీ అనుకోకుండా ఒకరోజు
నా స్నేహితురాలు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ "అమ్మలూ "దువ్వెన ఎక్కడ పెట్టావు ? కనిపించడం లేదు .ఆని పిలిచింది . అది విన్న నా స్నేహితురాలు మర్నాడు స్కూలుకి వెళ్ళినప్పుడు మిగతా స్నేహితులకి
లక్ష్మిని వాళ్ళ ఇంటిలో అమ్మలూ ఆని పిలుస్తారని ,నీ నిక్ నేమ్ ఏమిటి ? అన్న దానికి సమాధానంగా చెప్పేసింది .
నేను లక్ష్మీ అనే పిలుస్తారు ఆని చెప్పే లోపుగా ; అప్పుడు నాకు నా స్నేహితురాలి మీద చాలా కోపం వచ్చింది
కూడా ; తను అలా చెప్పటం వలన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అమ్మలూ అనే పిలిచేవారు .
ఈ పిలుపు ఇలా వింటూ ఉండగానే నాకు పెళ్లి అయ్యింది . కనీసం అత్తగారింట్లో నయినా నన్ను " లక్ష్మీ " ఆని
పిలుస్తారేమో ,అలా పిలిస్తే బాగుండును . ఈ అమ్మలక్క పిలుపు మరుగున పడుతుందేమో ననుకున్నా , కానీ
చెప్పానుగా , నాతోబాటే అది కూడా " ఇంతింతై వటుడింతై " అన్నట్లుగా అమ్మలు అన్న పేరు పిలుపు మార లేదు
సరికదా ; ఇంకా చాలా రూపాంతరాలు పొంది నన్నేమీ చెయ్యలేవు ఆని వెక్కిరిస్తున్నట్లుగా తయ్యారయిందని పించింది ఆలోచించగా .ఎందుకంటే మావారు కూడా నన్ను అమ్మలూ అనే పిలవటం మొదలుపెట్టారు .
నాకు అలా పిలవద్దు ఆని ,లక్ష్మీ అనే పిలవండి ఆని చెప్పాలనుకునే దాన్ని . పెళ్ళయిన క్రొత్తలో కొంచెం సిగ్గు
కొంచెం మొగమాటం ,కొంచెం భయం ,కొంచెం బెరుకు ఉండటం వలన చెప్పలేక పోయాను .
తర్వాత పిల్లలు వాళ్ళ పెంపకం ,చదువులు . వాళ్ళు పెద్ద అవ్వటం ఆ హడావిడిలో నా పేరు పిలుపు
గూర్చి పెద్దగా శ్రద్ధ పట్టలేదు . దాని గూర్చి అంతగా ఆలోచించే సమయము దొరక లేదు .
నేను పెళ్లి అయ్యాక మా అత్తగారింటికి వచ్చినప్పుడు చుట్టుప్రక్కల వారికి , చుట్టాలకి పరిచయం చేసినప్పుడు నా
నా పేరుని లక్ష్మీ ఆని చెప్పినా వాళ్ళు మాత్రం నా పేరుని నానా రకాలుగా పిలవటం మొదలు పెట్టారు .అదే లక్స్మమ్మో , లచ్చమమో అంటూ . చక్కటి పేరుని అలా వికృతనామాలుగా మార్చటం మొదలు పెట్టారు .
ఏదో పుట్టింట్లో , అమ్మలూ ఆని పిలిచే .పేరుని అమ్మలక్కగా మార్చేసరికే నేను కొంత ఇబ్బంది పడ్డాను . కానీ
మేట్టింట్లో నా అస్సలు పేరు కూడా ఇన్ని రూపాంతరాలు పొందేసరికి ,నాకు ఒక్క సారిగా ఒకలాగా అదే
ఏదో ఇబ్బంది కరంగా అన్పించ సాగింది .
అస్సలుపేరు ఎందుకు ఇన్ని మార్పులు పొందుతుంది ? పిలవటం కష్టమా ? కష్టమయిన పేర్లే గాకుండా ,
లలితమయిన పేర్లు కూడా రకరకాలుగా మారి పోతుంటాయి .
ఇంతకీ నామం అదే పేరు ,పేరులాగా ఉండకుండా ఎన్ని మార్పులు పొందుతుందో మనకు తెలియకుండానే
మనతో పాటు ఎదుగుతూ ,అప్పుడప్పుడు ఒదుగుతూ అదే వయస్సు వచ్చే సరికి మనకి కూడా నెమ్మదితనం
అణకువ ,ఓర్పు ,నేర్పు ఎలా వస్తాయో అలాగే పేరు కూడా జాణతనం ,చిలిపితనం ,సొగసు తనం పొంది
అందంగా ముస్తాబవుతుంది .
తీరా మనకి వృద్ధాప్యం వచ్చేసరికి మనకి ఎక్కడ లేని నీరసం ,నిస్సతువ ఎలా మన శరీరం లోకి వచ్చి
చేరుతాయో ,అలాగే పేరుకి కూడా ముసలితనం వచ్చేస్తుంది కాబోలు .అనుకోకుండా .
ఎందుకంటే మనవలు , మనవరాళ్ళు వాళ్ళ చిన్నతనంలో పేరుని సరిగా పిలవటం రాకపోవటం వలనో,ఏమో తెలియదు కానీ అమ్మమ్మా ,మామ్మా ఆని పిలవటం వలనో అసలు పేరు మరుగున పడుతుంది .
అసలు పేరు అదే పుట్టుక తర్వాత పెట్టిన పేరుతొ మనల్ని పిలవలేరు కదా ;మనకన్నా చిన్నవారవటం వలన
మన దగ్గర ఉన్న చనువు వలన చిన్నప్పుడు వాళ్ళు ముద్దుముద్దుగా పిలిచేఅమ్మమ్మా ,బామ్మా ,మామ్మా పిలుపులకి మనం అలవాటు పడటం వలన మన పేరు అదే అసలు పేరు మరుగున పడిపోతుంది కదా ;
అసలు ఎంతో అర్థవంతమైన, అందమైన పేర్లు పెట్టుకొని ఎందుకు అలా ,అదే బుజ్జీ ,చిట్టీ ,కన్నా ,
మున్నా ,బాబూ ,చిన్నీ లాంటి పేర్లతో పిలుస్తారెందుకో మరి ;పేర్లు పెట్టేటప్పుడు దేమునిపేరని ,తాతా ,మామ్మా పేర్లని
పెద్దల పేర్లని ,వాళ్ళమీద ఉన్న గౌరవముతోనో ,భక్తి భావముతోనో పిల్లలకి పేర్లు ,అదే బారసాల ,అదే నామ కరణం
చేస్తారు కదా .మరీ , వాళ్ళ పేర్లుతో పిలవటం బాగుండదని ఇలాంటి ముద్దు పేర్లతో పిలుస్తారు కానీ చిన్నప్పుడు
అయితే బాగుంటాయేమో , పెద్దయ్యాక ,అదే వయస్సు వచ్చేసరికి ఆ పిలుపులు అంతగా ముద్దు అనిపించవు
సరికదా ,అలాంటి పేర్లతో పిలవటం అలవాటు చేసినవాళ్ళ గూర్చి ఒక్కసారి ఆలోచించ వలసిందే .
ఏ కారణం లేకుండా ముద్దు పేర్లతో పిలవరు అని ఒకసారి అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని మూఢ నమ్మకాల వలన
అదే పెద్దలు ఎదురుగుండా వాళ్ళ పేర్లతో పిలవటం బాగుండదని ,పెట్టిన దేముని పేర్లతో పిలవకూడదని ,అలా
పిలిస్తే ఏధో చెడు జరుగుతుందని అనేటటువంటి భావనలవలన కూడా ముద్దు పేర్లు సార్ధకతను సంతరించుకుంటాయి
ఒక్కొక్కప్పుడు అని అనిపిస్తుంది .
ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఎంతటి అర్థవంతమైన , అందమైన పేరైనప్పటికి రకరకాల ముద్దు పేర్లుగా
మారిపోతుంటుంది .
భగవంతుడి పేరుకే ఎన్నో ముద్దు పేర్లున్నాయి కదా ; యశోద శ్రీ కృష్ణుడిని" చిన్ని కృష్ణా' ;అని ,దశరదుడు
శ్రీ రాముని" బంగారు తండ్రి: అని పిలవటమే నిధర్శనాలు కదా
కొందరి పేర్లు నిజంగా వాళ్లకి తగ్గట్లుగా ఉన్నాయి అనిపిస్తుంది .
విజయలక్ష్మి అన్న పేరు ఉన్నవారు ఎందులో నయినా , ఎన్ని సార్లయినా విజయం సాధిస్తే పేరుకి తగ్గట్లుగా
ఉన్నారనిపిస్తుంది .అలాగే " రాగ సుధ " పేరు ఉన్నవారు సంగీతంలో ,స,రి,గ,మ ,లుని తమ గొంతులో
చక్కగా పలికిస్తుంటే పేరుకి తగ్గట్లుగా పాడుతున్నరనుకుంటారు కదా ;వాళ్లకి తమ పేరు అయిన" రాగ సుధా"లో ఉన్న చివరి అక్షరము పలకటము రాకపోతే మాత్రం వాళ్ళ పేరుకి సార్ధకత ఉండదు కదా?
మొత్తానికి పేరు ఒక్కొక్కసారి ఒక మనిషిని ఎంతటి ఉన్నత స్థానానికి అయినా తీసుకొని వెళ్ళగలదు .
పేరు ఇంకొకసారి ఆదః పాతాళానికి తోసేస్తుంది కూడా !
పేరు పెన్నిదికి కూడా కారణమనిపిస్తుంది , అందుకే పేరులోనే పెన్నిధి అనే నానుడి కూడా వింటూ ఉంటాము . పేరు సన్నితత్వానికి కూడా దోహద పడుతుంది .

ఇదేనండి నాకు తెలిసిన నాపేరు కధ. బాగుందో , లేదో మీరే చెప్పండి చదివి ,లేదా విని .





















































































కుక్కరు

ఉక్కిరి బిక్కిరి ఊళ్ల ల మధ్య ఊపిరి సలుపని వాయువుల నడుమ అదరగొట్టే అగ్నిగుండం పైన బుడిబుడి వడివడిల నీటి సంద్రంలో అలుపెరుగని ఆయాసాల సాంద్రత అన్నమా? పప్పా ? కూరయా? అన్న ఆలోచనలు లేని ,ఆచరణ సాధ్యం కాని నా అవస్థ యేమని చెప్పను ? ఎవరికి ? తెలుపను?వినే నాధుడు కానీ ,వినే నాతి కానీ ఉన్నదా ?ఉన్నా ,ఊరకుండునా ?వినిపించుకోనా ?ఎవరిహడావిడి వారిది ఎవరి సంగతి వారిది .ఎవరి అవస్థ వారిది . ఎవరిదీ ఎవరు తీర్చును ? అయినా .నా పిచ్చి గానీ నేను ఉన్నదే అందుకు కదా . అది మరచి అందరిని అనుకొనేలా ?పప్పయినా ,ఉప్పుతో కూడిన కూరయినా ,అన్నమయినా ,పరమాన్నమయినా ,బిర్యాని అయినా



పులావు అయినా ఆధారాన్నినేనే కదా :ఎంత తెలివయిన వారు మానవులు ? నన్ను ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నారు? దానికి సంతోషించాలా ? నన్ను మండే పొయ్యి మీద నా కన్నీళ్ళు కారకుండా



వారే మరిన్ని నీళ్ళు నాలో నింపి ,అందులోనే మరి యొక గిన్నెలో ఏదయినా పదార్ధము పెట్టి ,నా బాధనూ



ఫై కి పెల్లుబకనీకుండా ,కాస్త పప్పు ,కాస్త బియ్యం అంటూ నన్ను ఊరదిస్తున్నట్టు నటిస్తూ
వారు ఆనందపడుతున్నారు .అన్ని ఉడికాక రుచి చూస్తూ .



వారి ఆనందాన్ని తనివితీరా చూడనీకుండా ఎక్కడ దిష్టి తగులుతుందో నని ,పీచు సబ్బుపొడి తీసుకొని



నా కన్నీళ్లు తుడుస్తున్నట్లు నా ఒంటి మీద పడిన {ఉడుకుతున్నప్పుడు పడుతాయికదా }నీళ్ళ చారికలు







కనబడనీకుండా బరబరా నీటికుల్లాయి క్రింద కాని ,జగ్గుతో నీరు తీసుకొని కాని తోమేస్తూ నా ఒంటి బాధను కూడా

నే లెక్క చేయకుండా ఉండేటట్టు ,ఎవరైనా చూస్తె ఎంత ముద్దుగా ,మొద్దుగా {మరి బాగా గట్టిగా ఉంటాను
కదా } ఉందోనని అనుకునేటట్టు చేస్తారు .
ఈ నా బాధను దిగ మ్రింగుకొని అందరిని ఆనంధపెట్టుతున్నందుకు నేను ఒక రకంగా నిస్వార్ధ సేవ చేస్తున్నానని
అనుకుంటాను . అందుకునే నేను వాళ్ళని ఏమీ అనుకోలేక మౌనం గా ఉండిపోతున్నాను .

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

చాలా బాగుంది. బెస్ట్ అఫ్ లక్.

సుబాష్

7, అక్టోబర్ 2010, గురువారం

5, అక్టోబర్ 2010, మంగళవారం

హాయ్ అర్జున్

హాయ్ అర్జున్
సుస్వాగతం . ఎలా ఉన్నావు ? అమ్మ ఒడిలో హాయిగా నిదురపోతున్నావా ? నాన్న కబుర్లు కి " ఊ" కొడుతున్నావా ? నీ చిలిపి చేష్టలుతో అమ్మా , నాన్నలని ఆడిస్తున్నావా ? తాతా ,అమ్మమ్మలిని ఆనందపరుస్తున్నావా? నీ బుజ్జి బుజ్జి చేతులని నాన్న పట్టుకుంటే బాగుందా ? అమ్మ లాలీ పాట విని మైమరచి పోతున్నావా ? నీ కను సైగలతో చిచ్చు పోసానని తెలుపుతున్నావా ? అన్నీ అయ్యాకా నేనే విజయము సాధించానని నవ్వుకుంటున్నావా ?
నేను పుట్టి అందరిని పెద్దవాళ్ళని చెసేసానని అనుకుంటున్నావా ? పెద్దనాన్నలు ,పెద్దమ్మలు
ఇంకా నన్ను చూడటానికి రాలేదనుకున్తున్నావా ? మామ్మా ,తాతయ్యా ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నావా ?
వస్తున్నాం , వస్తున్నాం త్వరలోనే . నీ చిన్నిచిన్ని చేతులని ,బుజ్జి ,బుజ్జి పాదాలని , సోగకన్నులని , నీవు
నేర్చుకున్న విద్యలని చూడాలని మాకు ఉందోయి .అందుకే ఆనందాల రెక్కలతో ,హరివిల్లుల ఆకాశపు అంచులు దాటి నీ దగ్గరకు వస్తున్నాము అతిత్వరలోనే .
నీ తాతయ్యా , మామ్మా .

20, జనవరి 2010, బుధవారం

కొంతమంది పేర్లు వింటూంటే వీళ్ళకి ఈ పేర్లు ఎలా పెట్టారని అనిపిస్తుంది . ఎందుకంటే విశాలాక్షి అంటే
విశాలమయిన కన్నులు అని అర్థము కదా ; ఒకావిడ ఆవిడ పేరు విశాలాక్షి అని చెప్పగానే నేను ఈవిడకు
ఈపేరు ఎలా పెట్టారా ?అని అనుకున్నాను ,ఎందుకంటే ఆవిడ కళ్ళు ఎంత చిన్నవిగా ఉన్నాయంటే ఏనుగు
కళ్ళు అంత ఉన్నాయి . ఒకతని పేరు కోటేశ్వరరావు అని చెప్పితే ఆశ్చర్య పోవటం నా వంతు అయ్యింది .
ఎందుకంటే అతనికి పాపం తినడానికే చాలా కష్టంగా ఉండేది .
ఇలాంటి పేర్లు ఎలా పెట్టతారో అని అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు .
పేరులో ఏముంది ? అని అంటూ ఉంటారు కొంతమంది . పేర్లోనే పెన్నిధి ఉందని అంటూ ఉంటారు మరి
కొంత మంది . ఔను ,నిజమే .పేరు తెలియక పోతే ఎవరేమిటో తెలియదు కదా ; పేరుని బట్టే కదా ఒక
మనిషిని గుర్తుంచు కోగలం కదా ;
ఇన్ని విశేషాలు ఉన్న పేరుని ముద్దు పేర్లుగా మార్చేస్తారెందుకో మనుష్యులు .
మొత్తానికి ఎవరి పేరయినా ఎలాంటి రూపాలు పొందుతాయో ,ఎవరికీ తెలియదు కదా .
ఇవన్నీ అదే బారసాలనాడు పెట్టిన పేర్లు , ముద్దుపేర్లుని వింటూ ఉంటె మనిషికి వాళ్ళ పేర్లు
వాళ్ళ జీవిత చరమాంకానికి ఎటువంటి మార్పులు పొందుతాయో వాళ్ళకే తెలియదు కదా ; అని అనిపిస్తుంది .
ఎంత గొప్ప వాళ్ళ పేర్లలోనైనా ముద్దు పేర్లు ఉండక మానవు కదా ;
మరి కొంత మంది పేర్లుకి బిరుదులూ కూడా చేరుతూ ఉంటాయి .సర్దార్ అని ,గాన కోకిల అని ,పద్మశ్రీ అని .
పేరు మార్పు పొందినప్పుడు ,అదే పిలిచే పద్ధతిని బట్టీ కానీ ,పలికే తీరుని బట్టీ కానీ అనుకోకుండా మంచి
మంచి లాభాలు కూడా కలుగుతాయని కొందరు అంటూ ఉంటారు . నిజమే ,కొందరి విషయములో అది
జరిగే ఉంటుంది . వినగా వినగా అందరికి వాళ్ళ వాళ్ళ ముద్దు పేర్లు అంతో ఇంతో లాభాలు ,అదృష్టాలు
తెచ్చే ఉంటాయి .

7, జనవరి 2010, గురువారం

LEARNING

నేను నేర్చుకున్నాను .