29, జూన్ 2017, గురువారం

కుక్కరు

ఉక్కిరి బిక్కిరి ఊళ్ల ల మధ్య ఊపిరి సలుపని వాయువుల నడుమ అదరగొట్టే అగ్నిగుండం పైన బుడిబుడి వడివడిల నీటి సంద్రంలో అలుపెరుగని ఆయాసాల సాంద్రత అన్నమా? పప్పా ? కూరయా? అన్న ఆలోచనలు లేని ,ఆచరణ సాధ్యం కాని నా అవస్థ యేమని చెప్పను ? ఎవరికి ? తెలుపను?వినే నాధుడు కానీ ,వినే నాతి కానీ ఉన్నదా ?ఉన్నా ,ఊరకుండునా ?వినిపించుకోనా ?ఎవరిహడావిడి వారిది ఎవరి సంగతి వారిది .ఎవరి అవస్థ వారిది . ఎవరిదీ ఎవరు తీర్చును ? అయినా .నా పిచ్చి గానీ నేను ఉన్నదే అందుకు కదా . అది మరచి అందరిని అనుకొనేలా ?పప్పయినా ,ఉప్పుతో కూడిన కూరయినా ,అన్నమయినా ,పరమాన్నమయినా ,బిర్యాని అయినా



పులావు అయినా ఆధారాన్నినేనే కదా :ఎంత తెలివయిన వారు మానవులు ? నన్ను ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నారు? దానికి సంతోషించాలా ? నన్ను మండే పొయ్యి మీద నా కన్నీళ్ళు కారకుండా



వారే మరిన్ని నీళ్ళు నాలో నింపి ,అందులోనే మరి యొక గిన్నెలో ఏదయినా పదార్ధము పెట్టి ,నా బాధనూ



ఫై కి పెల్లుబకనీకుండా ,కాస్త పప్పు ,కాస్త బియ్యం అంటూ నన్ను ఊరదిస్తున్నట్టు నటిస్తూ
వారు ఆనందపడుతున్నారు .అన్ని ఉడికాక రుచి చూస్తూ .



వారి ఆనందాన్ని తనివితీరా చూడనీకుండా ఎక్కడ దిష్టి తగులుతుందో నని ,పీచు సబ్బుపొడి తీసుకొని



నా కన్నీళ్లు తుడుస్తున్నట్లు నా ఒంటి మీద పడిన {ఉడుకుతున్నప్పుడు పడుతాయికదా }నీళ్ళ చారికలు







కనబడనీకుండా బరబరా నీటికుల్లాయి క్రింద కాని ,జగ్గుతో నీరు తీసుకొని కాని తోమేస్తూ నా ఒంటి బాధను కూడా

నే లెక్క చేయకుండా ఉండేటట్టు ,ఎవరైనా చూస్తె ఎంత ముద్దుగా ,మొద్దుగా {మరి బాగా గట్టిగా ఉంటాను
కదా } ఉందోనని అనుకునేటట్టు చేస్తారు .
ఈ నా బాధను దిగ మ్రింగుకొని అందరిని ఆనంధపెట్టుతున్నందుకు నేను ఒక రకంగా నిస్వార్ధ సేవ చేస్తున్నానని
అనుకుంటాను . అందుకునే నేను వాళ్ళని ఏమీ అనుకోలేక మౌనం గా ఉండిపోతున్నాను .

కామెంట్‌లు లేవు: