ఇంత నిశ్శబ్దము ఉదయంన్నే ఉండటము సంభవమా? అందులో కోడికూతకే లేచే జనసంద్రంలో ఇంత నిశ్శబ్దము
సాధ్యమా?ఇండియా లో సాధ్యము కాదు కాని అమెరికాలో సాధ్యము అయ్యింది .ఎలా?
అమెరికాలో సోమవారము ఉదయము నుండి శుక్రవారము సాయంత్రంవరకు జరిగే శబ్దా లన్నింటినిఒక్కసారిగా
తనలో విలీనం చేసుకొని ఏమీ ఎరుగని అమాయకపు జీవిలా శనివారము ఉదయం ఏర్పడిన నిశ్శబ్దము .
ముందు రోజు వరకు మలుపుల మేలికలలో తిరిగే కార్లు ,జనం అలసి సొలసి సేదతీరుతున్న శనివారం ఉదయం
నిశబ్ద్హత ఒక్క క్షణం కధలుతున్న గుండె ఆగినట్లు అనిపించింది .
సూర్యోదయమయినా కనీసం పది గంటలవరకు నిద్దుర లేవలేని జనం .మళ్ళీ ఈ అవకాశం ఒక వారం వరకు
రాదన్న ఆలోచనను కూడా ప్రక్కన పెట్టి ప్రశాంతముగా నిదురపోతున్న జనం . బద్ధకంగా ఒళ్ళు విరుద్దామంటే
ఆ విరుపు శబ్దానికి తనకి మళ్ళీ ఎక్కడ కదలికలు మొదలౌతాయో అని కన్నులు గట్టిగా మూసుకొని
పడుకొన్న జనం .
ప్రపంచంలోని అన్ని చోట్లా ఇలా ఉంటుందో ? లేదో ?కాని , ఇక్కడ మాత్రం అది సాద్యమనిపించింది . పిట్టలు
కూడా తమ కిలకిల రావాలని తమలోనే దాచుకొని నిశబ్ధముగా వేటకు బయలుదేరాయి .
వాటికి కూడా వీళ్ళమీద ఎంత జాలి ? చెట్లన్నీ గాలి వీచినా పిల్ల తేమ్మేరలలా వీచ సాగాయి కాని పెద్ద పెద్ద
శ బ్దాలతో ఆకులను కదిలించ కుండా , జనానికి కావలసిన ప్రశాంతతను ఇస్తున్నాయి .
మనుష్యుల మధ్యే కాదు చెట్లు ,పక్షులు ,ఇవి ,అవి,అని కావు పరిసరాలన్నీ ఇక్కడ జనాల నిశ్శబ్దతకు
సహకరించ సాగాయి .
నిజానికి నిశబ్దము ఎంత భయంకరం అయినది ? కానీ ఈ నిశబ్దము నిజంగా మనస్సు ను పరవశింప చేస్తోంది .
నిశబ్ద వాతావరణం , నిశిధీల సంగమము చూడ చక్కగా ఉన్నాయి .
మంచు జల్లులు ముసి ముసి నవ్వుల పరదాల మాటున నిశ్శబ్దము గా దాగున్నాయి .
రవి తన ప్రతాపాన్ని మరచి నిశ్శబ్దము గా ఈ అమెరికా నిశ్శబ్దాన్ని వీక్షించ సాగాడు తన కిరణాలతో .
మేఘాలన్నీ మబ్బుల చాటున నుండి దొంగతనంగా ,తమ దొరతనాన్ని మరచి నిశబ్ద వాతావరణాన్ని
ఎలా ఉంటుందో చూడ సాగాయి .
శబ్దం కాని ,శబ్దం రానీ ,నిశబ్దములో కూడా ఇంత ప్రశాంతత , యింతటి ఆనందాన్ని కలిగి ఉంటాయని
ఇప్పుడే తెలిసింది .
ఎప్పుడూ గలగలా పారే సెల యేరు ,ఎప్పుడూ కిలకిల రావాల . రస రాగాల మధ్య పయనించే పక్షులు .
ఎంద ప్రతాపాన్ని తన కిరణాల ద్వారా చూపే సూర్యుడు .అలలు సృష్టించే అలజడిని తనలో ఇముడ్చుకున్న
సముద్రము . గాలి తరంగాలని రంగరించుకొని తమలో దాచుకున్న వృక్షాలు ,ఇవన్నీ ఒక్క సారిగా ఇంత
నిశబ్దాన్ని ఎలా సంతరించుకున్నాయి ? అన్నదే నాలో, అదే నా మనస్సులో కలుగుతున్న ఆలోచనల
నిశబ్దము .
ఇదే అబద్ధం కాని అమెరికా నిశబ్దము .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి