30, డిసెంబర్ 2009, బుధవారం

Manassu

మనస్సు

మనోభావాల సుసంగమమే మనసు . నా మనస్సులో జరుగుతున్నఅనేక భావాలను అందరికి పంచుదామన్న ఆశ .
కానీ నా భావాలను పంచుకునే సరి అయిన వ్యక్తి నాకింతవరకు తారసపడనేలేదు అని అనుకుంటాను.
తల్లితో పంచుకుందామంటే మమతాను రాగాలను పంచుతుందే తప్ప మరియొకటి ఏమీతెలియని వ్యక్తి .
తండ్రితో సంప్రదిద్దామంటే తగని మొగమాటము
అప్పచెల్లెల్లుతో ఆలోచిద్దామంటే సరిగా అర్ధము చేసుకుంటారో లేదోనన్న అనుమానము .
అన్నదమ్ములతో చెప్పుదామంటే సమంజసముగా ఆలోచిస్తారో లేదోనన్న మీమాంస .
భార్యనే కదా అని భర్తతో చెప్పుదామంటే సరిగా అవగాహన చేసుకుంటారో లేదోనన్న సందేహము .
పిల్లలుతో పిసరంతైనా పంచుకుందామంటే ప్రపంచమే సరిగ్గా తెలియని వాళ్ళు .
స్నేహితులతో చెప్పుదామంటే హితులయిన స్నేహితులవునో కాదోనన్న అలజడి .
ఆడవారితో తోటివారేకదాని ఆలోచిదిద్దామంటే ఆనందాలనే సరిగా ఆనందించలేని వాళ్ళు .
అయినా ఇంతమందిని అనుకునేకన్నా ,అడిగేకన్నా ఆలోచించగా నా మనస్సుతోనే సంప్రదించితే సరిపోతుంది కదా !
అదే అసలుసిసలు అయిన మనిషని .



కామెంట్‌లు లేవు: